Friday 26 March 2010

(నా) బాల్య వివాహం

మొన్న, మొన్న అంటే ఒక 8 months back అనుకోండి, నాకో match వచ్చింది. నేను 21 అప్పుడు, ఆ అమ్మాయి వయసు 13, 8వ తరగతి  చదువుతుంది . ఆ అమ్మాయి  parents నన్ను మా అక్క marriage అప్పుడు చూసారంట.ఆ తర్వాత మెల్ల మెల్లగా మా family కి close అయ్యారు, తర్వాత కొన్ని రోజులకు ఇలా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పారు . మాకు(మా parents కి కాదనుకోండి)  ఆ అమ్మాయి వయసు తెలియగానే చాలా  షాకింగ్ గా అనిపింపిచింది, ఇంత చిన్న అమ్మాయి(పాప అనాలనుకుంటా )కి అప్పుడే మీరు సంబంధం  అడగటం ఏంటని.   మేమూ(parents కూడా) అదే చెప్పాం . దానికి వాళ్ళు మతి చెడిపోయే  సమాధానం ఇచ్చారు. అది ఏంటంటే ," మీరు అమ్మాయి మీకు OK  అనండి, పెళ్ళికి  సరిపోయేలా అమ్మాయిని మేము తయారు చేస్తాం, 3months లో". వాళ్ళ meaning ఏంటో నాకైతే తెలియలేదు కానీ , మొత్తానికి వద్దని చెప్పేసాం, అలానే ఇంత చిన్న వయసులోనే పెళ్ళి మంచిది కాదు అని కూడా చెప్పాం.

ఆ అమ్మాయి వాళ్ళ  daddy చదువుకున్నవాడు,  ప్రభుత్వ ఉద్యోగి, వుండేది townలో. వాళ్ళ relatives అందరు మంచి positionలో ఉన్నారు. వాళ్ళు కూడా support చెయ్యటమే కొంచెం బాధగా అనిపించింది.

చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తుంటే ,ఇంకా చదువుకోని వాళ్ళు, పల్లెటూరులలో ఉండే  వాళ్ళు   ఎలా ఆలోచిస్తారు?

6 comments:

  1. చదువుకున్న వాళ్ళయినా, చదువుకోనివాళ్ళయిన ఆడపిల్ల పుట్టిందంటే చాలు, వెంటనే ఆ పిల్ల పెళ్ళి గురించి ఆలోచించడం మొదలుపెడతారు చాలా కుటుంబాలలో.. అదో రోగం.. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో.. మంచి పని చేసారు తిరస్కరించి..

    ReplyDelete
  2. @swapna avunandi em cheddam cheppandi, aina ippude pelli chesukune uddeshalu naaku levu lendi, meeremi feel avvakandi.

    ReplyDelete
  3. నేను ఒక సారి హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తుంటే బస్సు లో ఒక ఆమె నా పక్కన కూర్చుంది... ఆవిడ గొప్పగా నాతో చెప్పింది... వాళ్ళ రెండో అమ్మాయి పెళ్లి అని... వాళ్ళ పెద్ద అమ్మైకి కూడా పదమూడవ ఏట పెళ్లి ఐపోయిందిట! రెండో అమ్మాయి వయసు పన్నెండు! విని షాక్ అయ్యా...

    ReplyDelete
  4. elanti vishalu village lo jarugutuuani ippatiki . akkada paristilulani batti vallu chesestharu.akkada unde vatavaraniki chala mandi ammailu chedipotunnaru chinna age(14,15) lo vallaki emi telidhu appudu . aa vishayam elagu okala parents ki telisipoi chinna vayasulone chesestunnaru pelli. kaani oka educated family vallu kooda ala aalochinchadam badakarmaina vishayam.

    ReplyDelete