Thursday 11 June 2009

నీవెవరు?

జడివానలో మల్లెపువ్వువా! 
బృందావనిలో పారిజాతానివా! 
కోనేటిలో ఎర్రకలువవా!
కాలువగట్టుపై పిల్లగాలివా! 
ఉషోదయవేళ నీటిబొట్టువా!
సాయంకాలపు పశ్చిమానివా! 
పండగనాటి రంగవళ్లివా!
చంటిపిల్లల కంటిపాపవా! 
పల్లెనోటిలో జానపదానివా!  
వసంతకాలపు నిండుపున్నమివా! 
చిన్నిపెదవిపై చిరునవ్వువా!
కన్నెగుండెలో కొంటెతనానివా.......!

---- సతీష్ జి కుమార్

2 comments:

  1. పొగడవలసినంత పొగిడి నీవెవరని అంటావా!!!

    ReplyDelete
  2. ఇవన్నీ మీ అద్దంతోనే !! ఔరా !..

    ReplyDelete