నీ నయనాలను చూసే ఆ బ్రహ్మ కలువను సృష్టించాడా!
నీ అధరాలను చూసే సంధ్యాకాల పశ్చిమం ఎరుపును పులుముకుందా!
నీ చిరుదరహాసం చూసే ముద్దబంతి సిగ్గుపడటం నేర్చుకుందా!
నీ చెక్కిలి చూసే చామంతి పువ్వు అవతరించిందా!
నీ గాత్రం వినే కోయిల ఆలపించటం మొదలెట్టిందా!
నీ సొగసును చూసే హిమగిరి సోయగాన్ని అలవర్చుకుందా!
నీ నడుము ఒంపులను చూసే నయాగారం అన్ని హొయలు పోతోందా!
నీ శిరోజాలను చూసే నిశీధి కాటుక పెట్టుకుందా!
నీ మువ్వల సవ్వడి వినే సెలయేరు గలగల పారుతోందా!
నీ ముఖకవళికలు చూసే ఇంద్రధనసు రంగులను సంతరించుకుందా!
నీ హూందాతనం చూసే కడలి గాంభీర్యాన్ని ధరించిందా!
నీ మేని పరిమళమే చిరుగాలికి జీవం తెచ్చిపెట్టిందా!
నీ హృదయగానాల నుండే ప్రేమ అనే పదం పుట్టిందా!
ఏమో అవునేమో లేకుంటే ప్రకృతిలో ఇన్ని అందాలు ఉండేవి కాదేమో....!!
---- సతీష్ జి కుమార్
Saturday 6 December 2008
Tuesday 2 December 2008
ఇండియా 1
1. భారతదేశంలో మొత్తం 325 భాషలు మాట్లాడతారు.
2. ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కవగా మాట్లాడే దేశం భారత్.
3. ప్రపంచంలో అతి పెద్ద సినిమా పరిశ్రమ మనదే.
4. ట్రాక్టర్ ఉత్పత్తిలో మనది 2వ స్థానం.
5. స్వయంగా సూపర్ కంప్యూటర్ తయారు చేసిన 3 దేశాలలో మనది ఒకటి. మిగిలిన రెండు జపాన్, యు.ఎస్.ఎ.
6. 17వ శతాబ్ధం(బ్రిటీష్ వారు రావడానికి ముందు) వరకు భారత్ అన్నింటి కన్న ధనిక దేశం.
7. 3వ అతి పెద్ద సైనిక బలగం.
8. కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించే 6 దేశాలలో మనది ఒకటి.
9. 4వ అతి పెద్ద ఎకానమీ.
10. భారత్ లో మొత్తం 5600 డైలీ పేపర్స్, 15,000 వీక్లీస్, 20,000 పీరియాడికల్స్ 21 భాషలలో ప్రచురితమౌతున్నాయి. మొత్తం సర్క్యులేషన్ 142 మిలియన్లు.

చైల్డ్ అబ్యూస్ (పిల్లలపై లైంగిక వేధింపులు)
1st class చదువుతున్న ఒక అమ్మాయి కాదు కాదు పాపపై స్కూల్ బస్ అటెండర్ లైంగిక చర్యలు, మరోచోట 2సం. కూడా నిండని పసికూన పై పక్కింటివాడి అత్యాచారయత్నం, ఇంకోచోట 7వ తరగతి అబ్బాయి పై, అతని స్కూల్ హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు, ఇంకా 13సం.ల అమ్మాయి(అమ్మాయి అనటం సబబు కాదనుకుంటాను)ని తనకు జన్మనిచ్చిన వాడే కబళించాలని ప్రయత్నాలు, 3యేల్ల పాపపై అత్యాచారం, 7యేల్ల బేబీని చెరిచిన ఓ క్రూరుడు..........
ఇలా చెప్పుకుంటూ పోతే ముక్కుపచ్చలారని పసిపిల్లలపై అమానుషాలు , అత్యాచారాలు, కన్నీటి కథలు లెక్కలేనన్ని. వెలుగులోకి వచ్చే ఈ దారుణాలు కొన్నైతే, బయటి ప్రపంచానికి తెలియని ఉదంతాలు ఎన్నెన్నో.
జన్మనిచ్చిన వారి నుంచి మొదలుకొని రక్త సంబంధీకులు, స్నేహితులు, ఇంటి ప్రక్కవారు, తెలిసిన వారు, తెలియని వారు, పని చేసేచోట యజమానులు, విద్య నేర్పే టీచర్ల వరకు, తమ కామ వాంఛకి ఏ పాపం తెలియని పసి హృదయాలను బలి చేస్తున్నారు. తమపై జరిగే ఈ క్రూరత్వాన్ని ఎవరికీ చెప్పుకోలేక, ఎదిరించలేక, నరకయాతనను అనుభవిస్తున్న తారలు మన చుట్టూ నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.
ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపవలసిన ఈ వయసులో కామాంధులకు బలైపోతున్న ఆ పసి హృదయాలు చేసే ఆత్మఘోష అంతా ఇంతా కాదు. తమ కుటుంబ సభ్యులే తమను కామ వాంఛతో చూస్తే వారి మనసు ఎంతగా విలపిస్తుందో.............
సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయానికి పుట్టినిల్లయిన మన దేశం ఇప్పుడు పిల్లలపై లైంగిక వేధింపులకు నిలయంగా మారింది. మన దేశంలో పిల్లలపై ఇటువంటి అమానుషాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో మొదటి మూడిట్లో మనం ఉండటం మనం సిగ్గుతో తల దించుకోవలసిన విషయం. ఒక పక్క అభివృద్ధి వైపు పరుగులు పెడుతూనే, మరో వైపు అనాగరికంగా మారిపోతున్న ఈ సమాజం మానవ సంబంధాలకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.
పెద్ద పెద్ద పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్నవారు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలం అని చెప్పుకునే వారు కూడా ఇలాంటి నీచ కార్యాలు, పిల్లలపై అత్యాచారలు, పిల్లలను వేరే రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చెయ్యడం దురదృష్టకరమైన విషయం.
నమ్మలేని నిజాలు:::
~~~~~~~~~~~~~~~~~~~~~~ * మన దేశంలో 53% పిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.
* మగ పిల్లలలో 52.94% & ఆడ పిల్లలలో 47.06% లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు.
* 22% తీవ్రమైన వేధింపులు.
* 50% వేధింపులు తెలిసిన వారి వల్లనే.
* ఎక్కువగ లైంగిక వేధింపులు ఆంధ్ర ప్రదేశ్,అస్సాం,బీహార్,ఢిల్లీ లో నమోదయ్యాయి.
* 5-12సం.ల మధ్య పిల్లలు ఎక్కువగా కామాంధులకు బలౌతున్నారు.
దురదృష్టకరమైన ఇంకో విషయం ఏమిటంటే ఏ పాప, ఏ బాబు ఇలాంటి పరిస్థితిని ఎదురుకుంటున్నారో, ఎవరి వల్ల మనోక్షోభను అనుభవిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిని నమ్మాలో తెలియని అయొమయం. ఈ నరక కూపంలో ఉన్న పిల్లలు తమ బాధను వారంతట వారే చెప్పుకోలేని పరిస్థితి.
ఇలా చీడపురుగులకు బలైపోతున్న వారిలో మన పక్కింటి పిల్లాడు ఉండొచ్చు, మన బంధువుల అమ్మాయి(పాప) ఉండొచ్చు, తెలిసిన వారి పిల్లలు ఉండొచ్చు, లేదా మనింట్లోనే ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన సంస్కృతి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది?? ఇదేనా మనం సాధిస్తున్న అభివృద్ది??
రేపటి మన భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. అలాంటి చేతులను కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. ఈ రంపపు కూపం నుంచి వాళ్లను విముక్తులను చేద్దాం.
SAVE CHILDREN

Subscribe to:
Posts (Atom)