Sunday 28 March 2010

Saturday 27 March 2010

స్వచ్ఛమైన ప్రేమ

ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇది.
విజయలక్ష్మి అనే అమ్మాయి తన officeలో పని చేసే చిరంజీవిని ప్రేమించింది. వారి ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదు, అయినా కూడా వాళ్ళు అధైర్య పడలేదు. తర్వాత కొన్నాళ్ళకు చిరంజీవి 2 kidneys పూర్తిగా పాడైపోయాయి అని తెలిసింది. విజయలక్ష్మి ఏ మాత్రం వెనుకంజ వేయకుండ అతనిని 2008 లో పెళ్ళి చేసుకుంది. తర్వాత తన ఒక kidneyని అతనికి ఇచ్చి తన ప్రేమను కాపాడుకుంది.

జోహార్ విజయలక్ష్మి గారు .ప్రేమంటే time pass అని కొత్త అర్థం వస్తున్న ఈ రోజుల్లో నిజమైన ప్రేమంటే ఏంటో నిరూపించారు. మీ లాంటి వాళ్ళు ఇంకా ఉండటం వల్లనే ప్రేమ కి ఈ మాత్రమైన విలువ వుంది.

మీ జీవితం మరియు ప్రేమ వెయ్యేల్లు కలకలలాడుతూ ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.

Friday 26 March 2010

(నా) బాల్య వివాహం

మొన్న, మొన్న అంటే ఒక 8 months back అనుకోండి, నాకో match వచ్చింది. నేను 21 అప్పుడు, ఆ అమ్మాయి వయసు 13, 8వ తరగతి  చదువుతుంది . ఆ అమ్మాయి  parents నన్ను మా అక్క marriage అప్పుడు చూసారంట.ఆ తర్వాత మెల్ల మెల్లగా మా family కి close అయ్యారు, తర్వాత కొన్ని రోజులకు ఇలా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పారు . మాకు(మా parents కి కాదనుకోండి)  ఆ అమ్మాయి వయసు తెలియగానే చాలా  షాకింగ్ గా అనిపింపిచింది, ఇంత చిన్న అమ్మాయి(పాప అనాలనుకుంటా )కి అప్పుడే మీరు సంబంధం  అడగటం ఏంటని.   మేమూ(parents కూడా) అదే చెప్పాం . దానికి వాళ్ళు మతి చెడిపోయే  సమాధానం ఇచ్చారు. అది ఏంటంటే ," మీరు అమ్మాయి మీకు OK  అనండి, పెళ్ళికి  సరిపోయేలా అమ్మాయిని మేము తయారు చేస్తాం, 3months లో". వాళ్ళ meaning ఏంటో నాకైతే తెలియలేదు కానీ , మొత్తానికి వద్దని చెప్పేసాం, అలానే ఇంత చిన్న వయసులోనే పెళ్ళి మంచిది కాదు అని కూడా చెప్పాం.

ఆ అమ్మాయి వాళ్ళ  daddy చదువుకున్నవాడు,  ప్రభుత్వ ఉద్యోగి, వుండేది townలో. వాళ్ళ relatives అందరు మంచి positionలో ఉన్నారు. వాళ్ళు కూడా support చెయ్యటమే కొంచెం బాధగా అనిపించింది.

చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తుంటే ,ఇంకా చదువుకోని వాళ్ళు, పల్లెటూరులలో ఉండే  వాళ్ళు   ఎలా ఆలోచిస్తారు?